AP Highcourt: అమరావతి పాదయాత్ర అనుమతి రద్దు పిటిషన్ కొట్టివేత
ABN , First Publish Date - 2022-11-01T14:46:48+05:30 IST
అమరావతి పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

అమరావతి: అమరావతి పాదయాత్ర (Amaravati farmer padayatra) అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టు (AP Highcourt) కొట్టివేసింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతుల (farmers)కు వెంటనే ఇవ్వాలని పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.