Home » Varla Ramaiah
తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్‌ది అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్‌కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని గుర్తుచేశారు.
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద నేతలు భయపడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సిట్ లోతుగా దర్యాప్తు జరిపి పాత్రదారులతో పాటు సూత్రదారులను కూడా అరెస్ట్ చేయాలన్నారు.
వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం మహిళలను, దళితులను అవమానించడమేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
Kolikapudi Srinivas: ‘‘ఆ వైసీపీ కుటుంబ సభ్యులు నన్ను టార్గెట్ చేశారు.. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్‌పై గతంలో ఆ కుటుంబసభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారు’’ అని కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు.
Varla Ramaiah:వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంచి ఫ్యామిలీ మెన్, బిజినెస్ మెన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తనదైన శైలిలో స్పందించారు.
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కళంగిరి మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికా ముఖంగా స్పందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు తప్పని తేలే వరకూ పార్లమెంట్ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని అన్నారు.
కూటమి ప్రభుత్వం తనపై కక్ష గట్టిందని నంగనాచి కబుర్లు చెబుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసు అధికారులపై డీజీపీ వెంటనే కేసు రిజిస్టర్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరికో పుట్టిన షర్మిలను జగన్ తన సొంత చెల్లిలా చూసుకున్నాడు అని..
జగన్ పాలనలో టీటీడీలో చాలా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వెంకటేశ్వర స్వామివారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యానికి హైందవ భక్తులందరూ భగ్గుమంటున్నారని చెప్పారు.
కూటమి ప్రభుత్వం మీద బోట్లతో వైసీపీ నేతలు పన్నిన కుట్రను దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీరియస్‌గా విచారించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను ఇసుక పడవలు ఢీ కొట్టడం.. వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని ఆరోపణలు చేశారు.