Varla Ramaiah: ‘పరకామణి’ కేసులో టీడీపీ జోక్యం ఉండదు
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:32 AM
పరకామణి చోరీ కేసుపై సీఐడీ జరుపుతున్న దర్యాప్తులో టీడీపీ జోక్యం ఉండదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌ను కోరారు. బుధవారం సాయంత్రం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం కాన్ఫరెన్సు హాలులో ఆయన టీడీపీ నేతలతోపాటు సీఐడీ చీఫ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
- నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి
- సీఐడీ డీజీని కోరిన వర్ల రామయ్య
తిరుపతి: పరకామణి చోరీ కేసుపై సీఐడీ జరుపుతున్న దర్యాప్తులో టీడీపీ జోక్యం ఉండదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌ను కోరారు. బుధవారం సాయంత్రం తిరుపతి(Tirupati)లోని పద్మావతి అతిథి గృహం కాన్ఫరెన్సు హాలులో ఆయన టీడీపీ నేతలతోపాటు సీఐడీ చీఫ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. శ్రీవారి పరకామణిలో ఎన్ని వందల కోట్లు కొట్టేశారో తెలియాల్సి వుందన్నారు.
ఈ కేసును నెలలోనే లోక్ అదాలత్‌లో రాజీ చేయడం వెనుక ఎవరున్నదీ ప్రజలకు తెలియాల్సి వుందన్నారు. హైకోర్టు ఇచ్చిన సమయం చాలకపోతే ఇంకా వ్యవధి తీసుకుని వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. టీటీడీకి ఆస్తులను బదిలీ చేసిన సమయంలో స్టాంప్ డ్యూటీ ఎవరు చెల్లించారో తేల్చాలన్నారు. దీని వెనుక ఎంత పెద్దవారున్నా వదలిపెట్టవద్దని కోరారు. నిక్కచ్చిగా, నిర్భయంగా విచారణ చేయాలని అభ్యర్థించారు. పరకామణి చోరీ కేసు రాజీకి కర్త, కర్మ, క్రియ అంతా భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ధనంజయరెడ్డిలేనని ఆరోపించారు.

వారి కుటుంబీకులు, బంధువుల ఆస్తులు వెలికి తీయాలని, పరకామణి చోరీ నిధులతో ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారో నిగ్గు తేల్చాలని కోరారు. దర్యాప్తులో తేల్చాల్సిన పలు సందేహాలకు సంబంధించి 27 అంశాలతో వినతి పత్రం ఇచ్చారు. ఆయన వెంట ఆయన వెంట తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, ఏపీ జీబీసీ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, ఏపీ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, శాప్ ఛైర్మన్ రవినాయుడు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నేతలు శ్రీధర్ వర్మ, కుమారమ్మ, మహేష్ యాదవ్, సూరా సుధాకరరెడ్డి, రజనీకాంత్ నాయుడు, పాఠకం వెంకటేష్, వట్టికుంట శంకర్ తదితరులున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నుంచీ వినతి పత్రాన్ని తీసుకున్న సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్.. ఆ పత్రాన్ని హైకోర్టుకు అందజేస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామన్నారు. లోతుగా విచారించి నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. దేవుడి ఆస్తికి సంబంధించిన కేసు కాబట్టి నిర్భయంగా దర్యాప్తు చేస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News