Home » Telangana Administration Day
భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు చేయనుంది.
Kaushik Reddy Arrest: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన ఆయనను వరంగల్‌కు తరలిస్తున్నారు.
న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్.. గత యాభై ఆరు సంవత్సరాల క్రితం నెలకొల్పిన ఈ కర్మాగారం భారతదేశానికే తలమానికంగా నిలుస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోని అణు ఇంధన శాఖలకు ఊపిరిగా నిలుస్తున్న ఈ సంస్థ ఏర్పాటై యాభై ఆరు వసంతాలు నిండాయి. ఈ సందర్బంగా ఓ ప్రత్యేక కథనం..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్‌పై కాగ్ నివేదిక సమర్పించగా దానిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు.
ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు అధికారులు(Waterboard officials) హెచ్చరిస్తున్నారు. వారి నల్లా కనెక్షన్ నంబర్‌పై మాత్రమే బుక్ చేసుకోవాలని.. ఒకరి కనెక్షన్ నంబర్(Connection number)ను మరొకరు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ కార్ రేస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్ రేసులో చోటుచేసుకున్న అవినీతిపై రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భార్యాభర్తలు (స్పౌజ్), మెడికల్ గ్రౌండు, పరస్పర (మ్యుచువల్) బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలయశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహానగరం చుట్టూ డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు.