ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
ABN, Publish Date - Jun 21 , 2025 | 09:19 AM
Kaushik Reddy Arrest: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన ఆయనను వరంగల్‌కు తరలిస్తున్నారు.
హనుమకొండ, జూన్ 21: బీఆర్‌ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (BRS MLA Kaushik Reddy) అరెస్ట్ అయ్యారు. ఈరోజు (శనివారం) ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యేను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యేపై సెక్షన్ 308(2), (4), 352 కింద కేసు నమోదు అయ్యింది.
మరోవైపు అక్రమంగా గ్రానైట్ క్వారీని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని, ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేస్తున్న నాటకం అంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..
యోగాను 130 దేశాల్లో జరుపుకుంటున్నాం..పోస్టల్ స్టాంపుల విడుదల
విశాఖలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రధాని మోదీ హాజరు
Read latest Telangana News And Telugu News
Updated at - Jun 21 , 2025 | 10:25 AM