Home » Police Vs Naxals
బస్తర్‌లో జరుగుతున్న మారణహోమాన్ని ఆపాలని.. కగార్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కోరింది. తమ డిమాండ్‌ను ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ నిరాకరించారని, ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా లేదని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రజలు భయోత్పాత వాతావరణంలో జీవిస్తున్నారని, యువతి-యువకులు పారిపోతున్నారని, ఈ దిశగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరింది.
మావోయిస్టు ఉద్యమాన్ని తెలుగు వారే నడిపిస్తే. అదే మావోయిస్టు పార్టీని దెబ్బకొట్టడంలోనూ తెలుగు పోలీసు అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్(encounter) కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. దీంతోపాటు ఘటనా స్థలంలో పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌లు (Encounter) ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. రెండ్రోజులుగా నక్సలైట్లు.. పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి...