Share News

Maoist Party: చర్చలపై ప్రకటన విడుదల..

ABN , Publish Date - Apr 10 , 2025 | 09:37 AM

బస్తర్‌లో జరుగుతున్న మారణహోమాన్ని ఆపాలని.. కగార్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కోరింది. తమ డిమాండ్‌ను ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ నిరాకరించారని, ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా లేదని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రజలు భయోత్పాత వాతావరణంలో జీవిస్తున్నారని, యువతి-యువకులు పారిపోతున్నారని, ఈ దిశగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరింది.

Maoist Party: చర్చలపై ప్రకటన విడుదల..
Maoist party statement

Maoist Party: మావోయిస్టు పార్టీ (Maoist Party) శాంతి చర్చల (Peace Talks)పై మరోసారి ప్రకటన (Statement) విడుదల చేసింది. అధికార ప్రతినిధి ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో (North West Sub-Zonal Bureau) రూపేష్ (Rupesh) పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, శాంతి చర్చల కోసం అనుకూల వాతావరణం ఏర్పరచాలని కోరింది. తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని ఏర్పరుస్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే పూర్తి యుద్ధం విరామం ప్రకటిస్తామని ఆ ప్రకటనలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రభుత్వం తన వైఖరి వెల్లడించిన తర్వాత మరింత స్పస్టతతో నిర్ణయం తీసుకుంటామంది.

Also Read..: కీలక దశకు మంత్రి లోకేష్ కేసు..


బస్తర్‌లో జరుగుతున్న మారణహోమాన్ని ఆపాలని.. కగార్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కోరింది. తమ డిమాండ్‌ను ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ నిరాకరించారని, ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా లేదని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రజలు భయోత్పాత వాతావరణంలో జీవిస్తున్నారని, యువతి-యువకులు పారిపోతున్నారని, ఈ దిశగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరింది. బస్తర్ నుంచి మావోయిస్టు నాయకత్వం పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మారణకాండను సమర్థించుకోవడానికి తాము అభివృద్ధి వ్యతిరేకులమని ముద్ర వేస్తున్నారని పేర్కొంది. తాము స్కూలు, హాస్పిటల్స్, అంగన్ వాడి, రేషన్ దుకాణాలు, తాగునీరు, కరెంటుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. తమ నుంచి కూడా ఒకటి రెండు విషయాల్లో తప్పులు జరిగాయని, వాటికి మేము క్షమాపణలు కూడా కోరామంది. జల్-జంగల్-జమీన్ నుంచి బేదాఖలు చేసే పర్యావరణానికి నష్టం కలిగించే ప్రాజెక్టులను వ్యతిరేకించామని మావోయిస్టు పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.


మావోయిస్టు కేంద్ర కమిటీ ఇటీవల శాంతి చర్చల గురించి ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసిందని, అందులో కూడా శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పర్చాలని కోరిందని మావోయిస్టు పార్టీ తెలిపింది. తమ కోరికను ఛత్తీస్‌గఢ్ సీఎం విజయశర్మ నిరాకరించారని పేర్కొంది. అనుకూల వాతావరణం లేకుండా శాంతి చర్చలు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ అనుసరిస్తున్న వైఖరినే ఇంకా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి మాటల ద్వారా స్పష్టమవుతున్నదని పేర్కొంది. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామంది. ప్రభుత్వం అనుసరిస్తున్న లొంగుబాటు విధానమే సమస్యకు పూర్తి పరిష్కారం అని చెప్పడాన్ని కూడా మావోయిస్టు పార్టీ తిరస్కరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు..

ఈ రోజు బంగారం, వెండి ధరలు...

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 10:05 AM