Home » Gajwel
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మట్టి తరలింపు విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు బాహాబాహీకి దారితీసింది.
‘‘మా ఊరి పేరు టీజీఎస్ ఆర్టీసీ టికెట్‌లో ఉండదా?’’ అంటూ గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం బంగ్లావెంకటాపూర్ నుంచి విడిపోయి మక్తమాసాన్‌పల్లి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.
గజ్వేల్ - ప్రజ్ఞాపూర్‌లోని ముంపు గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నిరసన సెగ తగిలింది. హరీశ్‌రావు రాకముందే ముంపు గ్రామాలవారు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లను కేసీఆర్ తన ఫాం హౌస్‌కు ఆహ్వానించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు.
శిబూసోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దు:ఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. జస్టిస్ పీసీ గోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిఽధిలోని బెజుగామలోని రాయరావు చెరువులో వేర్వేరు కాలాలకు చెందిన 24వ జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని రెండు శిల్పాలను తెలంగాణ చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు.
గజల్స్ గాయకుడు కేశిరాజు శ్రీనివాస్ గానం చేసిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత ఆడియో విడుదల కార్యక్రమం పాలకొల్లు లయన్స్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తండ్రి నరసింహారావు ఆడియోని విడుదల చేశారు