Home » Errabelli Dayakar Rao
రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు.
Kaushik Reddy Case: సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఎన్నికల హామీలను ఎగ్గొట్టారని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్లపై ఒట్టుపెట్టి మరీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. లగచర్లలో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
‘‘తెలంగాణలో నీవో గంజాయి మొక్కవు.. నీ పార్టీ వాళ్లే నిన్ను పీకి పారేస్తారు. నీ పార్టీలో వారే నిన్ను లెక్కచేయడం లేదు. 30 సార్లు ఢిల్లీకి వెళ్లినవ్.
అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఏం చేసిందని ‘ప్రజా పాలన విజయోత్సవ’ సభ నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు.
జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై బాంబులు వేస్తున్నారని మాజీ మంత్రి దయాకర్ రావు విమర్శించారు. నీళ్లు లేక పాలకుర్తి తొర్రూర్ ఎడారిగా మారిందని మండిపడ్డారు. శ్రీనుకు మద్దతు ఇస్తున్నందుకే తనపై ఈడీ పేరిట దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరికకు సీఎం రేవంత్ ఓకే చెప్పారా? బీఆర్‌ఎ్‌సను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా? కీలక నేత ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మంత్రి అవ్వాలనే తన కలను నేరవేర్చిన కేసీఆర్‌కు(KCR) హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరేందుకు చర్చలు మొదలుపెట్టారా? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.