Home » Dengue
రాష్ట్రంలో డెంగ్యూ వ్యాప్తి అధికమవుతోంది. డెంగ్యూ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో 10 జిల్లాల్లో డెంగ్యూ వ్యాప్తి అధికమవుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది.
వానలు ఊపందుకున్నాయి. వాటితో పాటే దోమలు కూడా. మరీ ముఖ్యంగా డెంగు దోమలు ఈ కాలంలో ఉధృతంగా పెరిగిపోతాయి.
Natural Ways To Protect From Dengue: దోమకాటు వల్ల సోకే ప్రాణాంతక వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. తడివాతావరణంలో ఈ దోమల కారణంగా విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి, డెంగ్యూ నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దోమకాటుకు గురై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విజృంభించి ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఇళ్లల్లో గుడ్ నైట్, ఆల్‌ఔట్ వంటివి దోమల నివారణ మందులు పెట్టనిదే నిద్రపోరంటే అతిశయోక్తి కాదు.
ఈ ఏడాది డెంగీ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. నిరుటికన్నా మించేకాదు.. ఐదేళ్లలో మునుపెన్నడూ లేని గరిష్టస్థాయిలో డెంగీ కేసులు నమోదయ్యాయి.
నగర వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, ప్రత్యేకించి ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ప్రారంభమవుతున్న సమయంలో డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు(Dengue and Chicken Gunya fevers) వ్యాపిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే 600 నుంచి 800 వరకు ఓపీ కేసులు వస్తున్నాయి. వైరల్ ఫీవర్లు, డెంగీ(Fevers, dengue), వాంతులు, విరేచనాలు, కీళ్లనొప్పులు, చలిజ్వరంతో బాధితులు క్యూ కడుతున్నారు.
తెలంగాణలో డెంగీ పాజిటివ్ రేటు తగ్గిందని, వ్యాప్తి తీవ్రతను అదుపులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
డెంగీతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు మహిళ కాగా, మరొకరు ఐదో తరగతి విద్యార్థి.
డెంగ్యూ వైరస్ కారణంగా రక్తనాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుంది. కొందరిలో డెంగీ సంక్షిష్టం కావడానికి ప్లాస్మా లీకేజీ ప్రధాన కారణం. కాళ్లు, కంటిచుట్టూ వాపు, రక్తంలో హెమటోక్రిట్ స్థాయిలు పెరగడం, పల్స్, బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి తదితర లక్షణాలు కన్పిస్తే.. ప్లాస్మా లీకేజీగా భావించి అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.