Share News

Health Tips: డెంగుకు గురి కాకుండా...

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:13 AM

వానలు ఊపందుకున్నాయి. వాటితో పాటే దోమలు కూడా. మరీ ముఖ్యంగా డెంగు దోమలు ఈ కాలంలో ఉధృతంగా పెరిగిపోతాయి.

Health Tips: డెంగుకు గురి కాకుండా...

వానలు ఊపందుకున్నాయి. వాటితో పాటే దోమలు కూడా. మరీ ముఖ్యంగా డెంగు దోమలు ఈ కాలంలో ఉధృతంగా పెరిగిపోతాయి. కాబట్టి వాటి బెడద లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...

ఈడిస్‌ ఈజిప్టై అనే దోమ ప్రధానంగా డెంగూ వైరస్‌ను వ్యాప్తి చేస్తుంది. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌.. విపరీతమైన జ్వరం, భరించలేనంత తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పులతో వేధిస్తుంది. కాబట్టి ఈ వైరస్‌ వ్యాప్తికి తోడ్పడే దోమలు ఇంటి పరిసరాల్లో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం....

  • పూల తొట్లు, వాటి సాసర్లు, పాత టైర్లు, బక్కెట్లు, నీళ్లు నిల్వ ఉండే వీలుండే పాత్రలన్నిటినీ ఖాళీ చేయాలి. అలాగే డ్రెయిన్లు, గట్టర్లలో అవరోధాలు ఏర్పడి, నీరు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి.

  • పొడవు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరిస్తూ, సాధ్యమైనంత మేరకు శరీరాన్ని కప్పి ఉంచే ప్రయత్నం చేయాలి.

  • దోమ తెరలు వాడుకోవాలి. కిటికీలు, తలుపులకు స్ర్కీన్స్‌ బిగించుకోవాలి.

  • మరీ ముఖ్యంగా దోమలు విజృంభించే సాయంకాలం వేళ తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.

  • ప్రతి కుటుంబం వారంలో ఒక రోజు పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండే వీలుండే కంటికి కనిపించని ప్రదేశాల కోసం గాలించే పనికి పూనుకోవాలి.

  • కూలర్ల ట్రేలు, రిఫ్రిజిరేటర్ల డ్రిప్‌ ప్యాన్లలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. గార్డెన్‌, బాల్కనీల్లో వదిలేసిన ఖాళీ సీసాలు, డబ్బాలను తొలగించాలి.

Updated Date - Jul 08 , 2025 | 12:13 AM