Share News

Dengue: వేగంగా ప్రబలుతున్న డెంగ్యూ

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:31 AM

రాష్ట్రంలో డెంగ్యూ వ్యాప్తి అధికమవుతోంది. డెంగ్యూ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో 10 జిల్లాల్లో డెంగ్యూ వ్యాప్తి అధికమవుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది.

Dengue: వేగంగా ప్రబలుతున్న డెంగ్యూ

చెన్నై: రాష్ట్రంలో డెంగ్యూ వ్యాప్తి అధికమవుతోంది. డెంగ్యూ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో 10 జిల్లాల్లో డెంగ్యూ వ్యాప్తి అధికమవుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ ప్రకారం, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, విల్లుపురం(Chennai, Kanchipuram, Chengalpattu, Vellore, Villupuram), కడలూరు, కోవై, తంజావూరు, తేని, కన్నియాకుమారి తదితర జిల్లాల్లో డెంగ్యూ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోంది.


nani2.2.jpg

ఆయా జిల్లాల్లో డెంగ్యూ ప్రబలేందుకు కారణమైన దోమల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలువలు, వీధుల్లో దోమల మందు పిచికారి చేయడంతో పాటు ఇంటింటికీ వెళ్లి దోమల మందు ఫాగింగ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే డెంగ్యూ నియంత్రణ ముందస్తు చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఆ ప్రకారం, ఇళ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2025 | 10:31 AM