మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
ABN , Publish Date - Apr 12 , 2026 | 09:35 AM
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్నారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు అధికారికంగా ఫలితాలను విడుదల చేస్తారు.
హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్నారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేస్తారు.
ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలతో పాటూ వొకేషనల్ కోర్సుల ఫలితాలను కూడా ఒకే సమయంలో ప్రకటిస్తారు. విద్యార్థులు తమ ఫలితాలను tgbie.cgg.gov.in, results.cgg.gov.in ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!
నాన్న నేర్పిన ఆ క్రమశిక్షణే నేను ఇప్పటికీ పాటిస్తున్నా..