ప్రేమలత జోస్యం.. డీఎంకే కూటమి విజయం తథ్యం
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:32 PM
అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం తథ్యమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత జోస్యం చెప్పారు.
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం తథ్యమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) జోస్యం చెప్పారు. కాంచీపురంలో ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సమేతంగా కామాక్షి అమ్మవారిని, ఉలగలంద పెరుమాళ్‌ను దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200కు పైగా నియోజకవర్గాలలో సునాయసంగా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
డీఎంకే కూటమిలోని మిత్రపక్షాలన్నింటికీ సీట్ల కేటాయింపులు ఖరారైన తర్వాతే తమ పార్టీ పోటీ చేయనున్న నియోజకవర్గాల జాబితాను వెల్లడిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో తనను, తన కుమారుడు విజయ్ ప్రభాకరన్‌ను పోటీ చేయమంటూ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు. టీవీకే నేత విజయ్ గురించి విలేఖరులు ప్రశ్నించినప్పుడు ఆయననే అడగమని చెప్పారు. ప్రేమలతతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి, న్యాయవాది రాజేంద్రన్ తదితరులు పర్యటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
54 వేల టన్నుల LPGతో గుజరాత్ పోర్ట్ చేరుకున్న శివాలిక్ నౌక
ఒడిశాలోని కటక్ SCB హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం, పది మంది మృతి
Read Latest Telangana News and National News