ఖలిస్థానీ ఉగ్రవాదిపై అరోపణలు కొట్టివేత.. తీర్పు వెలువరించిన కెనడా కోర్టు..
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:10 PM
కెనడాలో నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది ఇందర్‌జీత్ సింగ్ గోసాల్ గన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కెనడా కోర్టు ఆ ఆరోపణలను కొట్టేసింది. ఈ తీర్పు కారణంగా గోసాల్‌పై ఉన్న పలు అంక్షలు తొలగిపోతాయి.
కెనడాలో నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది ఇందర్‌జీత్ సింగ్ గోసాల్ గన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కెనడా కోర్టు ఆ ఆరోపణలను కొట్టేసింది. ఈ తీర్పు కారణంగా గోసాల్‌పై ఉన్న పలు అంక్షలు తొలగిపోతాయి. ఆయన ప్రయాణాలపై ఉన్న పరిమితులు కూడా రద్దవుతాయి. కెనడా చట్టం ప్రకారం, ఈ కేసును ఒక సంవత్సరం లోపు ప్రాసిక్యూషన్ తిరిగి తెరవకపోతే, పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఉంది (Inderjeet Singh Gosal case).
గత సంవత్సరం భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగిన ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్‌వంత్ సింగ్ పన్నూన్‌కు గోసాల్ సన్నిహితుడు. గతేడాది సెప్టెంబర్ 19వ తేదీన న్యూయార్క్‌కు చెందిన జగ్దీప్ సింగ్, టొరంటోకు చెందిన అర్మాన్ సింగ్ అనే ఖలిస్థానీ వేర్పాటువాదులతో కలిసి ఇందర్‌జీత్ ప్రయాణిస్తున్న సమయంలో అంటారియో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. వారి కారులో లోడ్ చేసిన హ్యాండ్ గన్ దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేశారు (Canada court decision).
కారులో ఉన్న ముగ్గురిపై ఆయుధ నేరం కింద పోలీసులు అభియోగాలు మోపారు (Sikhs for Justice Canada). అయితే రెండు నెలల తర్వాత అర్మాన్ సింగ్, జగ్దీప్ సింగ్‌లపై ఉన్న కేసును న్యాయమూర్తులు కొట్టివేశారు. గురువారం నాడు ఒంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు చెందిన ఒషావా బెంచ్.. ఇందర్‌జీత్‌పై కేసును కూడా కొట్టేసింది. తనపై ఆరోపణలను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలు సాగిస్తానని ఇందర్‌జీత్ ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి..
వాహనదారులకు కీలక అప్‌డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..
ఆ హామీలు ఇస్తే.. యుద్ధం ముగింపునకు రెడీ..: ఇరాన్ అధ్యక్షుడు