Share News

గడువు ముగిసిన గుడ్లను ఇలా గుర్తించండి

ABN , Publish Date - Apr 01 , 2026 | 10:03 AM

గడువు ముగిసిన గుడ్లు తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివే.. కానీ వాటి నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

గడువు ముగిసిన గుడ్లను ఇలా గుర్తించండి
Expired Eggs Side Effects

ఇంటర్నెట్ డెస్క్: గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, కానీ గడువు ముగిసిన లేదా పాడైపోయిన గుడ్లను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గుడ్లు వాడే ముందు వాటి నాణ్యతను పరీక్షించడం చాలా అవసరం.


పాడైపోయిన గుడ్లలో సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కలుగుతాయి. చిన్నపిల్లలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం.

వికారం, వాంతులు:

పాడైన గుడ్లు తింటే శరీరంలో విషపదార్థాలు పెరిగి వెంటనే వికారం, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జ్వరం, నీరసం:

బాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగితే శరీరం దానితో పోరాడేందుకు ఉష్ణోగ్రత పెంచుతుంది. దీంతో జ్వరం వస్తుంది. అలాగే అలసట, నీరసంగా అనిపిస్తుంది.


రోగనిరోధక శక్తి తగ్గడం:

గడువు ముగిసిన గుడ్లు తింటే రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. దాంతో చిన్న చిన్న వ్యాధులు కూడా త్వరగా అంటుకుంటాయి.

పాడైన గుడ్డును ఎలా గుర్తించాలి?

గుడ్డును నీళ్లలో వేసి చూడండి. తాజా గుడ్డు పూర్తిగా మునిగిపోతుంది. పాడైపోయిన గుడ్డు నీళ్లపై తేలుతుంది. అటువంటి గుడ్డును ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వాటి నాణ్యతపై జాగ్రత్త అవసరం. గడువు ముగిసిన గుడ్లు తినకుండా, ముందుగా చెక్ చేసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Apr 01 , 2026 | 10:52 AM