Share News

ఈ యోగాసనాలు చేస్తే వెంటనే రిలీఫ్

ABN , Publish Date - Apr 01 , 2026 | 07:49 AM

మీరు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? అయితే రోజూ కొన్ని యోగాసనాలను సాధన చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే ఉపశమనం పొందవచ్చు.

ఈ యోగాసనాలు చేస్తే వెంటనే రిలీఫ్
Headache Relief Yoga

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో తలనొప్పి చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి, జీవనశైలి మార్పులు, ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం వంటి కారణాలతో ఇది మరింత పెరుగుతోంది. అయితే మందులపై ఆధారపడకుండా, ప్రతిరోజూ కొన్ని సులభమైన యోగాసనాలు చేయడం ద్వారా తలనొప్పి నుంచి సహజంగా ఉపశమనం పొందవచ్చు.


యోగా చేయడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గడమే కాకుండా, మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కొన్ని ప్రత్యేక యోగాసనాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరచి, శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దీని వల్ల దీర్ఘకాలిక తలనొప్పి కూడా క్రమంగా తగ్గుతుంది. మీరు తరచూ తలనొప్పితో బాధపడుతుంటే, ప్రతిరోజూ ఉదయం 15–20 నిమిషాలు యోగాసనాలు చేయడం మంచిది. ఇప్పుడు తలనొప్పి తగ్గించడంలో సహాయపడే కొన్ని యోగాసనాలు చూద్దాం..


అధోముఖ శ్వానాసనం:

ఈ ఆసనం శరీరాన్ని పూర్తిగా సాగదీసి తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. అరచేతులు, పాదాలను నేలపై ఉంచి శరీరాన్ని ‘V’ ఆకారంలో పైకి లేపాలి. ఇది మెడ కండరాల్లోని ఒత్తిడిని తగ్గించి తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

1 (1).jpg


సేతు బంధాసనం:

ఈ ఆసనం వీపు మాత్రమే కాకుండా ఛాతీ, మెడ, వెన్నెముకకు కూడా ఉపశమనం ఇస్తుంది. వీపుపై పడుకుని మోకాళ్లను వంచి, శ్వాస తీసుకుంటూ నడుమును పైకి లేపాలి. ఇది ఒత్తిడి, అలసటను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

3.jpg


ఉత్తానాసనం:

ఇది నిలబడి చేసే ఆసనం. ముందుకు వంగి తలను కిందికి దించి శ్వాసను వదులుతారు. ఇది అలసటను తగ్గించి మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది. ముఖ్యంగా సైనస్ కారణంగా వచ్చే తలనొప్పి తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

2.jpg

ఈ యోగాసనాలను క్రమం తప్పకుండా సాధన చేస్తే తలనొప్పి సమస్యను సహజంగా నియంత్రించుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Apr 01 , 2026 | 07:49 AM