Share News

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణపై దాడికి యత్నం...

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:20 PM

పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు డిప్యూటీ స్పీకర్‌పై దాడికి ప్రయత్నించారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణపై దాడికి యత్నం...
Deputy Speaker Raghuramakrishna

పశ్చిమగోదావరి, మార్చి 27: జిల్లాలోని ఆకివీడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును(Deputy Speaker Raghuramakrishna Raju) అడ్డుకోవడానికి కొందరు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు డిప్యూటీ స్పీకర్‌ను అడ్డుకుని దాడికి యత్నించారు. వెంటనే కూటమి నేతలు వారిని అడ్డుకున్నారు.


దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కూటమి నాయకులపై మేకులు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

పీఎం సూర్యఘర్ కనెక్షన్లను వేగవంతం చేయాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 27 , 2026 | 01:22 PM