Share News

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

ABN , Publish Date - Mar 26 , 2026 | 09:49 AM

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన
Markapuram Bus Accident

అమరావతి, మార్చి 26: ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. మరోవైపు ఈ ప్రమాదంపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Niammala Ramanaidu) దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.


క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలిలో బాధితులకు అన్ని రకాల సహాయ చర్యలు అందించాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.


ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద ఈరోజు(గురువారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్‌ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

కుప్పంలో మూడో రోజుకు నారా భువనేశ్వరి పర్యటన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2026 | 10:13 AM