Share News

విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం: మంత్రి రవికుమార్

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:56 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ జగన్ నాశనం చేసిన విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవంతో గాడిలో పెడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 22 నెలలుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ట్రూడౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని అన్నారు.

విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం: మంత్రి రవికుమార్
Gottipati Ravi Kumar

అమరావతి, ఏప్రిల్ 1: యువగళం పాదయాత్రలో చేనేతలకు నారా లోకేశ్ ఇచ్చిన హామీ నేటి నుంచి అమల్లోకి రానుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gotttipati Ravikumar) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా చేనేతలు పడుతున్న కష్టాలను చూసిన లోకేశ్ వారికి ఇచ్చిన హామీని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి చేర్చిందని తెలిపారు. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పథకం ద్వారా ఏటా ప్రభుత్వం రూ.150కోట్లు పైనే భరిస్తోందని మంత్రి వెల్లడించారు.


ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ జగన్ నాశనం చేసిన విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) తన అపార అనుభవంతో గాడిలో పెడుతున్నారని మంత్రి అన్నారు. 22 నెలలుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ట్రూడౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన నష్టాలను సరిదిద్దుతూనే రైతులు, చేనేతలు, ఆక్వా, సలూన్‌లకు సబ్సిడీలు ఇస్తున్నామని అన్నారు. వినూత్న ఆలోచనలతో సోలార్, విండ్, పంప్‌డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజెన్ విధానాలతో విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని తగ్గించుకుంటున్నామని తెలిపారు.


బయట నుంచి విద్యుత్ కొనుగోళ్లు తగ్గించి.. చరిత్రలో లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి పెంచామని మంత్రి రవికుమార్ తెలిపారు. ఓల్టేజ్ సమస్యలు పరిష్కరించేందుకు పెద్దఎత్తున సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో విద్యుత్ సంస్కరణలు ఇంతటితో ఆగేవి కాదని.. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత వెసులుబాటు కల్పించేలా మార్పులు తీసుకొస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య

అమరావతి చట్టబద్ధత బిల్లు.. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2026 | 11:57 AM