ISRO New Record: GSLV F 16 ప్రయోగం విజయవంతం
ABN, Publish Date - Jul 30 , 2025 | 07:41 PM
అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కలిసి అభివృద్ధి చేసిన నైసార్ (NISAR ) ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కలిసి అభివృద్ధి చేసిన నైసార్ (NISAR ) ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించారు. ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. దాదాపు 2,393 కిలోల బరువుతో ఉన్న నైసార్ శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి సజావుగా ప్రవేశపెట్టారు.
Updated at - Jul 30 , 2025 | 07:41 PM