Share News

America White House: అమెరికా వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

ABN , Publish Date - Mar 10 , 2025 | 10:23 AM

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కలకలం నెలకొంది. ఓ అనుమానితుడిపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ సంస్థ కాల్పులు జరిపింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

America White House: అమెరికా వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కలకలం నెలకొంది. ఓ అనుమానితుడిపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ సంస్థ కాల్పులు జరిపింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇండియానా నుంచి వాషింగ్‌టన్ వచ్చిన ఓ వ్యక్తి కదలికలను స్థానికులు గుర్తించారు. అతను వైట్ హౌస్ సమీపంలో ఉన్నట్లు సీక్రెట్ సర్వీసెస్ సంస్థకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.


అధ్యక్ష భవనానికి కొంత దూరంలో పార్క్ చేసిన ఓ వాహనాన్ని గుర్తించారు. సమీపంలో ఓ వ్యక్తి నడిచి వెళ్తుండగా అతని వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. అధికారులు రావడాన్ని గమనించిన అతడు వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.దీంతో సీక్రెట్ సర్వీసెస్ సంస్థ సిబ్బంది కూడా అనుమానితుడిపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు ఫ్లోరిడాలో ఉన్నారు. కాల్పులు జరపడంతో అనుమానితుడు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 10 , 2025 | 10:24 AM