పహల్గామ్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ అలర్ట్
ABN, Publish Date - Apr 23 , 2025 | 04:58 PM
Pakistan Military Alert: భారతదేశం చర్యలకు ఉపక్రమిస్తే తిప్పికొట్టడానికి పాకిస్థాన్ ఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్ సమీపంలోని సరిహద్దు ప్రాంతాలకు పాకిస్థాన్ సైన్యాన్ని మోహరిస్తోంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్ముకశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో పాకిస్థాన్ అలర్ట్ అయ్యింది. జమ్ముకశ్మీర్ సమీపంలోని సరిహద్దు ప్రాంతాలకు పాకిస్థాన్ సైన్యాన్ని మోహరిస్తోంది. అలాగే కరాచీ నుంచి యుద్ధ విమానాలను లాహోర్, రావల్పిండి తరలిస్తోంది పాకిస్థాన్ ఆర్మీ. భారతదేశం చర్యలకు ఉపక్రమిస్తే తిప్పికొట్టడానికి పాకిస్థాన్ ఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్ పెహల్గామ్‌లోని బైసారన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 26 మంది మరణించినట్లు సమాచారం.
ఈ దాడికి టీఆర్‌ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఈ సంస్థ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాకు చెందిన దిరెసిస్టెంట్ ఫెంట్‌గా గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల
Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..
Read Latest National News and Telugu News
Updated at - Apr 23 , 2025 | 05:03 PM