భక్తుల కోలాహలం నడుమ హనుమాన్ శోభయాత్ర
ABN, Publish Date - Apr 12 , 2025 | 02:36 PM
Hanuman Shobha Yatra: హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్ర సాగుతోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 12: నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర (Hanuman Shobha Yatra) కొనసాగుతోంది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు విజయోత్సవ ర్యాలీ కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ జరిగే రూట్లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వీర హనుమాన్ విగ్రహాన్ని చేర్చారు. వీహెచ్‌పీ జాతీయ నేత శ్రీరామ్ విలాస్ దాస్ వేదాంత్ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. వేలాది మంది భక్తుల కోలాహలం నడుమ శోభాయాత్ర సాగుతోంది. ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు.
మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిన్ చేయండి.
ఇవి కూడా చదవండి
AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
Inter Results Top Districts: ఇంటర్ ఫలితాల్లో టాప్‌లో నిలిచిన జిల్లాలు ఇవే
Read Latest AP News And Telugu News
Updated at - Apr 12 , 2025 | 02:37 PM