బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసీఆర్ అసహనం

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:21 PM

KCR: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చిన సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) అధ్యక్షత పార్టీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలు, కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా.. తెలంగాణ భవన్‌కు (Telangana Bhavan) కేసీఆర్ చేరుకున్న సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో.. ఒకర్లకండిరా బాబు.. దండం పెడతానంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెలలో బహిరంగా సభకు బీఆర్‌ఎస్ ప్లాన్ చేసింది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్‌జూబ్లీ పేరుతో భారీ కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

జగన్ గుంటూరు పర్యటనపై సందిగ్థత...

ఛాంపియన్స్ మహా సమరం

Read Latest Telangana News And Telugu News

Updated at - Feb 19 , 2025 | 04:28 PM