పవన్ చాలా ఫ్రెష్‌గా ఉన్నారు..
ABN, First Publish Date - 2025-03-17T15:06:01+05:30 IST
AP Assembly: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి డిప్యూటీ స్పీకర్ రఘురామ చెప్పిన మాటలు కాసేపట్లో నవ్వులు పూయించేలా చేశాయి. పవన్ ఈరోజు చాలా ఫ్రెష్‌గా ఉన్నారని రఘురామ అన్నారు.
అమరావతి, మార్చి 17: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన జరిగింది. రేపు (మంగళవారం) టీ టైంలో శాసనసభ్యులతో జరిగే ఫోటో షూట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ పాల్గొనాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కోరారు. అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా ఫ్రెష్‌గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారని అనడంతో సభలో నవ్వులు విరబూశాయి. పవన్ ‘ఆరోగ్యం కూడా బాగా ఉన్నట్టుగా ఉంది. రేపు అసెంబ్లీలో సభ్యులకు ఫోటో షూట్ ఉంది. సీఎం చంద్రబాబు వస్తారు.. డిప్యూటీ సీఎం పవన్ కూడా రావాలి. అప్పుడే ఫోటో కు నిండుదనం వస్తుంది’ అని డిప్యూటీ స్పీకర్ రఘురామ అన్నారు.
ఇవి కూడా చదవండి...
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్
Jathvani False Cases: సీఎం, హోంమినిస్టర్.. న్యాయం చేయండి ప్లీజ్
Read Latest AP News And Telugu News
Updated at - 2025-03-17T15:11:05+05:30