బిగ్‌బాస్‌పై నారాయణ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - May 05 , 2025 | 04:43 PM

Narayana On Bigg Boss: బిగ్‌బాస్‌పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హీన సంస్కృతి యువతను చెడు మార్గంలో పట్టిస్తుందని.. రంగానికి కళంకితం చేస్తోందని కామెంట్స్ చేశారు.

తిరుపతి, మే 5: బిగ్‌బాస్‌పై (Big Boss) సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) మరోసారి విరుచుకుపడ్డారు. బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని తాను వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించిందన్నారు. లీసులు మొదలుకొని, జిల్లా కోర్టు వరకు అందరూ రెండేళ్లుగా తనపిటీషన్ స్వీకరించకుండా దండం పెట్టారన్నారు. ఎట్టకేలకు హైకోర్టు స్పందించిందన్నారు. నాగార్జునకు, బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. బిగ్ బాస్ హీన సంస్కృతి యువతను చెడు మార్గంలో పట్టిస్తుందని..రంగానికి కళంకితం చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. చీప్‌గా వ్యభిచారం వద్దు, కాస్ట్లీ వ్యభిచారం చేయండి అన్నట్టుంది బిగ్ బాస్ వ్యవహారం అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను కల్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్

Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం


Read Latest AP News And Telugu News

Updated at - May 05 , 2025 | 04:43 PM