Revanth Reddy Praises: చంద్రబాబు, వైఎస్సార్‌పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 09 , 2025 | 01:34 PM
ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మారిందంటే ..అందుకు కారణం చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మారిందంటే.. అందుకు కారణం చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ పాలన సాగిందని, తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని కాంగ్రెస్ సర్కార్ నిరూపించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పోలీసులను గూండాలంటారా?: పట్టాభిరామ్
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టండి: షర్మిల
Updated at - Nov 09 , 2025 | 01:34 PM