ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:34 PM

AP Cabinet Decisions: ఏపీ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.

అమరావతి, ఏప్రిల్ 3: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌లో (AP Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రోన్ కార్పొరేషన్ స్వతంత్ర విభాగంగా ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్ పోర్టుకు అనుమతి ఇచ్చింది కేబినెట్. విద్యుత్ శాఖలో రూ.710 కోట్ల రుణం కోసం హడ్కోకి ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సాగర్ ఎడుమ కాలువ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో త్రీస్టార్ సహా ఇతర ప్రీమియం హోటళ్ల అభివృద్ధికి బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల్లో వివిధ జీవోల రేటిఫికేషన్‌కు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.



ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated at - Apr 03 , 2025 | 04:39 PM