CM Chandrababu: ఒక గొప్ప నటుడిని కోల్పోయాం..
ABN, Publish Date - Jul 13 , 2025 | 01:52 PM
సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు మృతి బాధాకరమన్నారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిదన్నారు. 40 ఏళ్ల పాటు తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారని గుర్తు చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా పనిచేశారని చెప్పారు. కోట శ్రీనివాసరావు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ ఎంతో చురుగ్గా పనిచేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
Updated at - Jul 13 , 2025 | 01:52 PM