అలిపిరి వద్ద పరిస్థితి ఇదీ

ABN, Publish Date - Apr 21 , 2025 | 04:08 PM

Alipiri Traffic Issues: తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

తిరుమల, ఏప్రిల్ 21: అలిపిరి (Alipiri) వద్ద శ్రీవారి భక్తులకు భద్రతా సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్న తగినంతగా భద్రతా సిబ్బంది సంఖ్య పెరగకపోవడంతో వాహనాల తనిఖీలు నెమ్మదిగా సాగుతున్నాయి. వాహన తనిఖీల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండలేక, ఎండవేడిమి తట్టుకోలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ సోమ, మంగళవారాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. ఈక్రమంలో తిరుమలకు భక్తుల తాకిడి అధికమైంది.


అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అలిపిరి వద్ద పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. వీఐపీ దర్శనాలు కూడా ఉదయం 10 గంటల నుంచి ఉన్న నేపథ్యంలో కూడా అలిపిరి వద్ద వాహనాల తాకిడి అధికంగా ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

Tirumala Darshan: శ్రీవారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారో తెలుసా

Read Latest AP News And Telugu News

Updated at - Apr 21 , 2025 | 04:12 PM