దొరికిన బ్లాక్ బాక్స్
ABN, Publish Date - Jun 13 , 2025 | 05:00 PM
Ahmedabad Plane Crash: అత్యంత విషాదకరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రధానంగా బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. బ్లాక్ బాక్స్‌లో ఎంత మేరకు సమాచారం ఉందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
అహ్మదాబాద్, జూన్ 13: అహ్మదాబాద్ విమాన ప్రమాద (Ahmedabad Plane Crash) దర్యాప్తులో పురోగతి లభించింది. ఘటనా స్థలిలో కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది మృతిచెందారు. అంతేకాకుండా విమానం మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొనడంతో అందులో ఉన్న దాదాపు 24 మంది మెడికోలు మరణించారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో ప్రధానంగా బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది.
బ్లాక్ బాక్స్‌లో ఎంత మేరకు సమాచారం ఉందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బ్లాక్స్ బాక్స్‌తో పాటు అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
రోడ్డు పక్కన్న నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
తల్లుల ఖాతాల్లోకి నిధులు.. ఆనందంలో కుటుంబాలు
Read Latest National News And Telugu News
Updated at - Jun 13 , 2025 | 05:01 PM