Best Punjabi Dishes: ఫుడ్ లవర్స్.. ఈ పంజాబీ వంటకాలు ఒక్కసారి ట్రై చేస్తే చాలు, మళ్లీ మిస్ అవ్వరు!
ABN , Publish Date - Nov 29 , 2025 | 06:09 PM
పంజాబీ వంటకాల టేస్ట్, రూచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. బటర్, క్రీమీ డిషెస్ వంటివి ఫుడ్ లవర్స్‌ను మంత్రముగ్ధలను చేస్తాయి. ఈ రుచికరమైన వంటకాలను ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: సండే హాలీడే కోసం పిల్లలే కాదు పెద్దలు సైతం ఎంతగానో ఎదురుచూస్తారు. సండే రోజున ఎంచక్కా చికెన్ లేదా మటన్ తెచ్చుకుని ఆరాంసే ఇంట్లో వండుకుని కుటుంబమంతా కలిసి హ్యాపీగా తింటూ టైం స్పెండ్ చేస్తారు. అయితే, ప్రతి సండే ఎప్పుడూ ఒకే రకంగా వంట చేయకుండా కొంచెం డిఫరెంట్‌గా వంటలు చేస్తే పిల్లలతోపాటు పెద్దలు కూడా ఎంతో సంతోషిస్తారు. భారతీయ వంటకాలలో పంజాబీ వంటకాలు చాలా స్పెషల్. వీటి టేస్ట్, రూచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. బటర్, క్రీమీ డిషెస్ వంటివి ఫుడ్ లవర్స్‌ను మంత్రముగ్ధలను చేస్తాయి. ఇలాంటి రుచికరమైన వంటకాలు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ఫుడ్ లవర్స్ కోసం బెస్ట్ పంజాబీ వంటకాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
బటర్ చికెన్
బటర్ చికెన్ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. దాని క్రీమీ టొమాటో సాస్, వెన్న, మసాలాల కలయిక చాలా రుచికరంగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రోటీ, నాన్, పులావ్ వంటి వాటితో బటర్ చికె చాలా బాగుంటుంది.

ఆవకూర, మొక్కజొన్న రోటీ
పంజాబీలు శీతాకాలంలో ఆవకూర, మెక్కజొన్న రోటీని ఎక్కువగా తింటారు. ఆవకూర, మెంతికూర వంటి వివిధ ఆకుకూరలతో కలిపి చేసే ఈ కూరను మొక్కజొన్న రొట్టెతో కలిపి తింటారు. ఈ వంటకాన్ని వేడివేడిగా ఉన్న రోటీతో తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ వంటకం ఎంతగానో సహాయపడుతుంది.

తందూరి చికెన్
చాలా మంది ఎంతో ఇష్టంగా తినే తందూరి చికెన్ ఒక పంజాబీ వంటకం. తందూరి చికెన్ రుచి చాలా బాగుంటుంది. చికెన్‌ను పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో కలిపి మ్యారినేట్ చేస్తారు. మ్యారినేట్ చేసిన చికెన్‌ను అధిక వేడి మీద ఉండే తందూరిలో వండుతారు. ఓవెన్‌లో లేదా గ్రిల్‌లో కూడా తయారు చేయవచ్చు.

చోలే భాతురే
చోలే భాతురేను సాధారణంగా అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటారు. శనగలను ఉప్పు, టమోటాలు, ఉల్లిపాయలు, వివిధ మసాలా దినుసులతో వండుతారు. గరం మసాలా, జీలకర్ర, కొత్తిమీర వంటి మసాలాలను ఉపయోగిస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది

మసాలా చన్నా
మసాలా చన్నా అంటే ఉడికించిన శనగలు (chickpeas) కారంగా, టొమాటోతో మసాలా గ్రేవీలో వండుతారు. ఈ వంటకాన్ని చోలే మసాలా లేదా చన్నా మసాలా అని కూడా పిలుస్తారు. దీనిని పూరీ, రోటీ లేదా అన్నంతో కలిపి తింటారు.

ఇవీ చదవండి:
త్వరలో బంగారం రుణాల్లోకి పిరామల్ ఫైనాన్స్
For More Latest News