Train Accident: కదులుతున్న రైలు ఎక్కబోతూ మహిళ మృతి
ABN , Publish Date - May 26 , 2025 | 05:15 AM
కదులుతున్న రైలులో ఎక్కబోతూ.. ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది.

చర్లపల్లి రైల్వే టర్మినల్‌లో ఘటన
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కుషాయిగూడ, మే 25 (ఆంధ్రజ్యోతి): కదులుతున్న రైలులో ఎక్కబోతూ.. ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది. లింగంపల్లికి చెందిన మట్టల వెంకటేశ్, శ్వేత దంపతులు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఏపీలోని అనకాపల్లికి బయలుదేరి లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వారు ప్రయాణించాల్సిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో రద్దీ కారణంగా డీ-8 బోగీకి బదులు డీ-3 బోగిలోకి ఎక్కారు.
ఈలోగా రైలు కదలడంతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో దిగి బోగీ మారుదామ నుకున్నారు. స్టేషన్‌లో రైలు ఆగడంతో దిగిన వారిలో భర్త ఇద్దరు పిల్లలు డీ-8బోగీలోకి ఎక్కారు. కానీ శ్వేత ప్లాట్ ఫారంపైనే ఉండిపోయింది. ఈలోగా రైలు కదలడంతో భయపడిపోయిన శ్వేత రైలు ఎక్కబోతుండగా జారి కింద పడిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం