POCSO Case: బాలికలపై వార్డెన్ కుమారుడు లైంగిక వేధింపులు
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:50 AM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు

నారాయణఖేడ్ బీసీ హాస్టల్‌లో ఘటన
నారాయణఖేడ్/నాగల్‌గిద్ద, జూలై 22 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు, మాజీ కౌన్సిలర్ రాజేష్ చౌహాన్ తరచూ హాస్టల్‌కు వస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాడని, సిబ్బంది కూడా దూషిస్తున్నారంటూ బాలికలు సోమవారం రాత్రి నారాయణఖేడ్
పోలీసస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం వసతి గృహం ఎదుట ఆందోళన చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి జగదీశ్వర్ హాస్టల్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాలికలను వేధింపులకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వార్డెన్‌తో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది లక్ష్మి, శాంతాబాయిలను విధుల నుంచి తప్పించామని తెలిపారు. వార్డెన్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సహా రాజేష్ చౌహాన్‌పై కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. పోక్సో కేసును కూడా నమోదు చేసినట్లు వివరించారు. కాగా, సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండల పరిధి మోర్గి మోడల్ బాలికల హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో.. హాస్టల్ కేర్ టేకర్ భూదేవితో పాటు ఇద్దరు వంట సిబ్బందిని తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి