Share News

DCP Ankit On Suri Gang: హత్యలకు ప్లాన్.. ముందే అడ్డుకున్నాం.. రౌడీ షీటర్ సూరి అరెస్ట్‌పై డీసీపీ

ABN , Publish Date - Nov 07 , 2025 | 03:28 PM

చర్లపల్లి జైల్లో బిహార్‌కు చెందిన ఠాకూర్‌తో సూరికి పరిచయం అయిందని డీసీపీ తెలిపారు. అతని ద్వారా బిహార్ నుంచి రెండు షార్ట్ వెపన్స్ కొనుగోలు చేశారని తెలిపారు. వరంగల్ అడ్డాగా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు.

DCP Ankit On Suri Gang: హత్యలకు ప్లాన్.. ముందే అడ్డుకున్నాం.. రౌడీ షీటర్ సూరి అరెస్ట్‌పై డీసీపీ
DCP Ankit On Suri Gang

వరంగల్, నవంబర్ 7: మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సూరి అలియాస్ దాసరి సురేందర్ అలియాస్ మోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సురేందర్‌తో పాటు అతని అనుచరులు ఏడుగురినీ వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు రివాల్వర్లు, మూడు మ్యాగజైన్స్, ఒక బుల్లెట్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీ డ్రైవర్‌ను సూరి గ్యాంగ్ గన్‌తో బెదిరించిన విషయం తెలిసిందే. రౌడీ షీటర్ సూరిపై 45కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ నుంచి సూరిపై సిటీ బహిష్కరణ వేటు పడింది. దీంతో గత కొన్ని నెలలుగా వరంగల్ అడ్డాగా ఈ గ్యాంగ్ నేరాలకు పాల్పడుతోంది. సూరి గ్యాంగ్ అరాచకాలను ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN-Andhrajyothy) ముందే బయటపెట్టింది.


ఇక.. రౌడీ షీటర్ సూరి అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ 18న శాయంపేటలో లారీ డ్రైవర్‌ను బెదిరించి ఓ ముఠా దోపిడీకి పాల్పడిందని.. సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముఠా కోసం గాలించామని అన్నారు. లారీ డ్రైవర్‌ను బెదిరించింది రౌడీ షీటర్ సూరి గ్యాంగ్ అని గుర్తించినట్లు తెలిపారు. నిన్న మరో రాబరీ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా కొత్తగట్టు సింగారం వద్ద గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. సూరిపై 45 క్రిమినల్ కేసులు, 3 పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయన్నారు. రాచకొండ కమిషనరేట్ నుంచి రౌడీషీటర్ సూరి బహిష్కరణకు గురయ్యాడని చెప్పారు.


చర్లపల్లి జైల్లో బిహార్‌కు చెందిన ఠాకూర్‌తో సూరికి పరిచయం అయిందన్నారు. అతని ద్వారా బిహార్ నుంచి రెండు షార్ట్ వెపన్స్ కొనుగోలు చేశారని తెలిపారు. వరంగల్ అడ్డాగా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని డీసీపీ వెల్లడించారు. భూపాలపల్లిలో కొంతమందిని హత్య చేసేందుకు చర్చలు జరిపారని.. అయితే సూరి గ్యాంగ్ నేరాలను ముందే అడ్డుకున్నామన్నారు. సూరితోపాటు అతని ముఠా సభ్యులు మరో ఏడుగురిని అరెస్ట్ చేశామని డీసీపీ అంకిత్ కుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఇవాళ రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 05:19 PM