Share News

Crime News: రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..: ఎస్పీ కిరణ్ ఖరే

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:21 PM

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు రోజుకో మలుపు తిరుగింది. చివరికి పోలీసులు హత్య కేసు మిష్టరీని చేధించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.

Crime News: రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..: ఎస్పీ  కిరణ్ ఖరే

జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally Dist.) కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త (Social Activist) నాగవెళ్లి రాజలింగమూర్తి (Nagavelli Rajalingamurthy) హత్య కేసు (Murder Case)లో చిక్కుముడి వీడింది. కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూ వివాదాలే రాజలింగమూర్తి హత్యకు కారణంగా నిర్ధారించామన్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ వార్త కూడా చదవండి..

ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి


హత్య కేసులో ఏడుగురు అరెస్ట్..

మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. నిందితుల పేర్లు వెల్లడించారు. ఏ1 రేణికుంట్ల సంజీవ్ (36), ఏ2 పింగిలి సీమంత్ (22), ఏ3 మోరె కుమార్ (35), ఏ4 కొత్తూరి కుమార్ (38), ఏ5 రేణికుంట్ల కొమురయ్య (60), ఏ6 దాసరపు కృష్ణ (45), ఏ7 రేణికుంట్ల సాంబయ్య (56).

పరారీలో ఉన్న నిందితులు...

ఏ8 కొత్త హరిబాబు - మాజీ వైస్ చైర్మన్ (బీఆర్ఎస్), ఏ9 పుల్ల నరేష్ తదితరులు.. వారి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు , 5 బైక్‌లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నలుగురు కలిసి హత్య చేయగా.. ఇద్దరు రెక్కీలో పాల్గొన్నారని.. మిగతా వారు వాళ్ళతో అటాచ్‌లో ఉన్నారన్నారు.


కాగా జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు రోజుకో మలుపు తిరుగింది. నిందితులుగా భావిస్తున్న ఐదుగురితోపాటు బీఆర్‌ఎస్‌ నేత, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు పాత్రపై పోలీసులు ప్రధానంగా దృష్టిసారించినట్లు విశ్వసనీయ సమాచారం. హత్య జరిగిన తర్వాత.. కాల్‌ డేటా రికార్డ్‌(సీడీఆర్‌)ను విశ్లేషిస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్‌ నేత పాత్రపై అనుమానాలు బలపడ్డాయని తెలుస్తోంది. హత్య జరిగినప్పటి నుంచి హరిబాబు పరారీలో ఉండడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తున్నాయని విశ్వసనీయవర్గాలు చెప్పా యి. బుధవారం సాయంత్రం 7.15 గంటల సమయంలో హత్య జరగ్గా.. నిందితుల్లో ఒకరైన రేణిగుంట్ల సంజీవ్‌(ఏ1).. హరిబాబును ఫోన్‌ద్వారా సంప్రదించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

హరిబాబు కాల్‌ డేటాను విశ్లేషించి, ఆ రోజు మాట్లాడిన వ్యక్తులందరినీ పిలిపించి.. విచారించారు. ఈ క్రమంలో భూపాలపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు రేషన్‌ డీలర్లు, ఒక వీఆర్‌ఏ, గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఒక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి పేర్లు తెరపైకి వచ్చినట్టు సమాచారం. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరిపారు. వీరిలో ఓ వ్యక్తి ఫోన్‌ నుంచి హత్య జరిగిన సమయంలో ఫోన్‌కాల్‌ వెళ్లినట్లు గుర్తించారు. రేషన్‌ డీలర్లు, వీఆర్‌ఏ విచారణలో.. హత్యతో వారికి సంబంధాలున్నట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరిబాబుకు అత్యంత సన్నిహితులైన ఖాశీంపల్లికి చెందిన ఇద్దరు ప్రధాన అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు. రాజలింగమూర్తి హత్య వెనక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. కాగా.. హరిబాబు గతంలోనూ వివాదాస్పద కేసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ చీఫ్‌ హోదాలో జిల్లాలో పాదయాత్ర జరిపినప్పుడు ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆ కేసులో హరిబాబు ప్రధాన నిందితుడు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

రాజలింగమూర్తి హత్య కేసుపై వీడిన సస్పెన్స్

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఎర్రన్నాయుడు తిరుగులేని నాయకుడు: సీఎం చంద్రబాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 23 , 2025 | 12:21 PM