Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:59 PM
Operation Karreguttalu: తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం 2 వేల మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

ములుగు - ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 22: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అలజడి రేగింది. ములుగు జిల్లాలోని (Mulugu District) కర్రెగుట్టలను 2 వేల మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అటు ఛత్తీస్‌గఢ్ నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే కర్రెగట్టల చుట్టూ భారీ పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ప్రకటించిన మావోయిస్టులు.. ఆ వైపు ఆదివాసీలు వెల్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో ఏక్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. అయితే ఊసూర్ బ్లాక్ల్‌లోని కర్రెగుట్టల సమీపంలో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి భద్రతా బలగాలు - మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. అయితే కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని.. కాల్పులు జరపడం లేదని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు గత వారం రోజులు క్రితమే మావోయిస్టుల పేరుతో ఓ లేఖ విడుదలైంది. కర్రెగుట్టల చుట్టూ బాంబులు, లాండ్‌మైన్స్ అమర్చామని, ఎవరూ రావద్దంటూ వెంకటాపురం డివిజిన్ ఏరియా శాంతా పేరుతో లేఖ విడుదల చేశారు. అయితే తర్వాత అదంతా కూడా ఫేక్ లేఖ అని పౌరహక్కులు చెప్పారు. మావోయిస్టు సంఘాలు అలాంటి లేఖలు విడుదల చేయరని, శాంతా అనే పేరుతో ఎవరూ లేరని మావోయిస్టులు చెప్పినట్లుగా పౌరహక్కుల సంఘాలు తెలిపాయి. అయితే కర్రెగుట్టలో మాత్రం ఏం జరుగుతుంది అనే దానిపై ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు ఎలాంటి సమాచారం ఇవ్వని పరిస్థితి.
కాల్పులు ఆపండి: హరగోపాల్
అయితే కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు. తమకున్న సమాచారం మేరకు భద్రతాబలగాల వైపు నుంచి కాల్పులు జరుగుతున్నాయని, ఇప్పటికే 2వేల మంది భద్రతా బలగాలు కర్రెగుట్టల చుట్టూ మోహరించారని వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించవచ్చని తెలిపారు. వెంటనే సాయుధ చర్యలు నిలిపివేయాలని డిమాండ్చేశారు.ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని తెలిపారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి
Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల..
Visakha Mayor Post: విశాఖ మేయర్ పీఠం దక్కడంలో గేమ్‌ఛేంజర్ ఆ ఎమ్మెల్యేనే
Read Latest Telangana News And Telugu News