Share News

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

ABN , Publish Date - Apr 27 , 2025 | 07:27 PM

BRS Meeting In Elkathurthy: పార్టీ ఎమ్మెల్సీ కవిత ఎంట్రీ కోసం పాట పాడమని సింగర్‌ను నిర్వాహకులు వేదిక మీదకు పంపారు. అయితే పార్టీలోకి ఓ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీవ్ర అసహనంతో బౌన్సర్లను పెట్టి సింగర్‌ను కిందకి బలవంతంగా దింపేశారు.

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

వరంగల్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. సభకు హాజరైన ప్రజల్లో ఉత్తేజం నింపేందుకు కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. ఈ సభ ప్రారంభానికి ముందు కళా వేదికపై రసాబాస చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మరో వ్యక్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. వివాదాన్ని ఉటంకిస్తూ.. బీఆర్ఎస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పెద్దాయన కేసీఆర్ అంటే ఆ పార్టీ నేతల్లో భయం లేకుండా పోయిందని.. ఇందుకు నిదర్శనమే ఈ వాగ్వాదం అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలకు ఈ ఘటన నిదర్శనమని చెప్పారు.

రసాభాసగా BRS సభ అంటూ పోస్ట్ చేసిన సామ రామ్మోహన్ రెడ్డి ఇంకా ఎమన్నారు.. తన పోస్ట్‌లో ఏం పేర్కొన్నారో యధవిధంగా...

'రజతోత్సవ సభ.. అందరూ చూస్తుండగా వేదిక మీదనే పింకీల పీకులాట ! ఒక్కప్పుడు కేసీఆర్ అంటే భయం ఉంటుండే , ఇపుడు క్రమశిక్షణ తప్పింది.. కవిత ఎంట్రీ కోసం పాట పాడమని సింగర్‌ని పంపితే, అసహనంతో బౌన్సర్లను పెట్టి కింది నూకిన ** వర్గం లీడర్ రసమయి..??? వేదిక మీదనే కొట్టుకుంటూ ఇజ్జత్ తీసుకున్న పింకీలు..' అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

For Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 08:46 PM