Share News

Bandi Sanjay: వక్ఫ్‌ సవరణతో పేద ముస్లింలకు న్యాయం

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:44 AM

పేద ముస్లింలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కేంద్రం వక్ఫ్‌ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: వక్ఫ్‌ సవరణతో పేద ముస్లింలకు న్యాయం

  • చట్టానికి వ్యతిరేకంగా బడా చోర్‌ల సభ

  • ఆ సభకు అంతా సమకూర్చింది రేవంత్‌

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌

పెద్దపల్లి టౌన్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): పేద ముస్లింలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కేంద్రం వక్ఫ్‌ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బడా చోర్‌లందరూ కలిసి మీటింగ్‌ పెట్టారని విమర్శించారు. టైటిల్‌ డీడ్‌ లేని భూములను వక్ఫ్‌ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎం పార్టీదని మండిపడ్డారు. 8 లక్షల ఎకరాల భూమి, రూ.10 లక్షల కోట్ల సంపద ఉన్నా.. ఒక్క పేద వాడికి కూడా వక్ఫ్‌ సంస్థ ఉపయోగపడలేదని విమర్శించారు. తాము సభ పెడితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు.


శనివారం హైదరాబాద్‌లో జరిగిన సభకు కర్త, కర్మ, క్రియ రేవంత్‌రెడ్డి అని.. మీటింగ్‌కు నిధులు సమకూర్చింది కూడా ఆయనేనని ఆరోపించారు. మంచి ఉద్దేశంతో వక్ఫ్‌ సవరణ చట్టాన్ని తెస్తే మత కోణంలో ప్రతిపక్షాలు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.


Also Read:

క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 21 , 2025 | 03:44 AM