Vegetable prices: భయపెడుతున్న బెండ.. ఘాటెక్కిస్తున్న మిర్చి
ABN , Publish Date - Nov 14 , 2025 | 08:34 AM
మార్కెట్‌లో కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. గత నెల చివరి వారంతో పోల్చితే పలు రకాల రేట్లు వడివడిగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- పెరిగిన కూరగాయల ధరలు
- రైతుబజార్‌లో కిలో పచ్చిమిర్చి రూ.45
- అదేబాటలో చిక్కుడు, బీరకాయ, దొండకాయ
హైదరాబాద్ సిటీ: మార్కెట్‌లో కూరగాయల ధరలు(Vegetable prices) మళ్లీ పెరిగిపోయాయి. గత నెల చివరి వారంతో పోల్చితే పలు రకాల రేట్లు వడివడిగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రతి కూరలో తప్పని సరిగా వినియోగించే పచ్చిమిర్చి రేట్లలో రూ.5-10 వరకు పెరుగుదల కనిపిస్తుండడంతో తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నగరంలోని మార్కెట్లు, రైతుబజార్లలో పెరిగిన రేట్లను ఆసరా చేసుకుంటున్న రిటైల్ వ్యాపారులు ఎడాపెడా దోచుకుంటున్నారు. రైతుబజార్‌లో ఒక్కోరకానికి రూ.5 వరకు పెరిగితే, రిటైల్ దుకాణాలు, కాలనీల్లో ఉండే షాపుల్లో మరో రూ.5-10 వరకు అదనంగా పెంచి విక్రయాలు చేస్తున్నారు.

ధరల వ్యత్యాసం ఇలా..
రైతుబజార్, కూరగాయల మార్కెట్‌లో పచ్చిమిర్చి రేటు ఎక్కువగా పెరిగింది. గత అక్టోబరు చివరి వారంలో రైతుబజార్‌లో కిలో రూ.40 ఉన్న మిర్చి ధర.. వారం రోజులుగా రూ.45 పలుకుతోంది. మాల్స్, రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ డెలివరీల్లో దీనిని రూ. 60 వరకు అమ్ముతున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. క్యాప్సికమ్, దొండకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, క్యారట్ రేట్లు కూడా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. టమాట, ఉల్లిపాయ ధరలు కొద్దిగా అందుబాటులో ఉన్నాయని, చలితీవ్రత కారణంగా దిగుమతి బాగా తగ్గడంతో రేట్లు పెరిగాయని వాపోయారు. మరో వారం రోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బోయినపల్లి మార్కెట్, రైతు బజార్‌లో కూరగాయల ధరలు (కిలో చొప్పున)
రకం మార్కెట్ రైతుబజార్
గోరు చిక్కుడు రూ.60 రూ.65
బెండకాయ రూ.50 రూ.55
క్యారట్ రూ.45 రూ.50
దొడ్డు మిర్చి రూ.40 రూ.45
బీరకాయ రూ.40 రూ.45
తెల్ల మిర్చి రూ.30 రూ.35
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భరత్‌రామ్ నుంచి ప్రాణహాని ఉంది
Read Latest Telangana News and National News