Kachiguda Yeshwantpur: గూడ్ న్యూస్.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ కోచ్‌లు 8 నుంచి 16కు పెంపు..
ABN , Publish Date - Jul 07 , 2025 | 06:11 PM
హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణించే ప్రజలకు మంచి శుభవార్త వచ్చింది. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ (Kachiguda Yeshwantpur) వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు 8 కోచ్‌లకు బదులుగా, 16 కోచ్‌లతో ప్రయాణించనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌కు (Kachiguda Yeshwantpur) వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు మరింత ఎక్కువ మంది ప్రయాణికుల కోసం సిద్ధమైంది. ఈ రైలు, ఇంతకు ముందు 8 కోచ్‌లతో 530 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నడుస్తుండగా.. ఇప్పుడు 16 కోచ్‌లతో 1,128 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా అప్‌గ్రేడ్ అయింది. ఈ మార్పు జులై 10 నుంచి అమలులోకి వస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అధికారులు తెలిపారు.
ఈ మార్పు ఎందుకు?
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి కాచిగూడ, బెంగళూరు నగరాల మధ్య అత్యంత ప్రజాదరణ పొందిన రైలుగా నిలిచింది. ఈ ట్రైన్ ప్రతిసారి కూడా 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడస్తోండటం విశేషం. అంటే అనేక మంది ఈ టైన్లో సీట్ల కోసం వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా భారతీయ రైల్వే, ఈ రైలుకు అదనంగా మరో 8 కోచ్‌లను చేర్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రైలు మొత్తం 16 కోచ్‌లతో మరింత సౌకర్యవంతంగా, మరింత మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది.
కొత్త కోచ్‌ల వివరాలు
ఇంతకు ముందు ఈ రైలులో 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్, 7 చైర్ కార్ కోచ్‌లు ఉండేవి. కానీ ఇప్పుడు, కొత్త మార్పులో 14 చైర్ కార్ కోచ్‌లు (1,024 మంది ప్రయాణికుల సామర్థ్యం), 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు (104 మంది ప్రయాణికుల సామర్థ్యం ) ఉంటాయి. ఈ కొత్త మార్పుతో మొత్తం 1,128 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు.
రెండు ఐటీ నగరాల మధ్య ప్రయాణం
హైదరాబాద్, బెంగళూరు ఈ రెండు నగరాలు భారతదేశంలోని ఐటీ రాజధానులుగా ప్రసిద్ధి గాంచాయి. ప్రధానంగా వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులు ఈ రెండు నగరాల మధ్య తరచూ ప్రయాణిస్తుంటారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి అత్యాధునిక రైలు వీరికి వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఈ రైలు సామర్థ్యం రెట్టింపు కావడంతో మరికొంత మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో అత్యంత ఆధునిక రైళ్లుగా పేరుగాంచాయి. ఇవి అధిక వేగం, సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. వైఫై, ఆన్‌బోర్డ్ క్యాటరింగ్, ఆటోమేటిక్ డోర్స్, బయో-వాక్యూమ్ టాయిలెట్స్ వంటి ఫీచర్లు ఈ రైళ్లను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ప్రస్తుతం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ రైలు సామర్థ్యం పెరగడంతో మరికొంత మంది ఈ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించే ఛాన్సుంది.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి