UPSC: డీజీపీ పేర్ల జాబితా వెనక్కి
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:01 AM
పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎ్‌ససీ) వెనక్కి పంపినట్లు సమాచారం.

రాష్ట్రానికి తిప్పి పంపిన యూపీఎస్‌సీ
కొత్త డీజీపీ ఎంపికకు 8 మంది ఐపీఎ్‌సల పేర్ల
జాబితాను ఇటీవల పంపిన రాష్ట్ర ప్రభుత్వం
వారిలో ఇద్దరికి మిగిలిన సర్వీసు 6 నెలల్లోపే..
ఇది నిబంధనలకు విరుద్ధమన్న యూపీఎ్‌ససీ
తాజా జాబితా పంపాలని రాష్ట్రానికి సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎ్‌ససీ) వెనక్కి పంపినట్లు సమాచారం. 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో ఈ జాబితా పంపినా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని తెలిసింది. దీంతో యూపీఎ్‌ససీ ఆ జాబితాను వెనక్కి పంపినట్లు సమాచారం. మార్గదర్శకాలను పాటిస్తూ జాబితాను పంపాలని సూచించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి రాష్ట్రం కొత్త డీజీపీ ఎంపిక సమయంలో 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల పేర్లను పంపించాలి. పదవీ విరమణకు ఆరు నెలలు మాత్రమే ఉన్న వారి పేర్లను ఈ జాబితాలో చేర్చకూడదు. ఇక్కడే తెలంగాణ అధికారులు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత డీజీపీ జితేందర్ (పూర్తి అదనపు బాధ్యతలు) పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబరులో, కొత్తకోట శ్రీనివాస రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టులో ముగియనుంది. అంటే వీరిద్దరి పదవీ విరమణ ఆరు నెలల్లోపే ఉంది. కాబట్టి వీరి పేర్లను జాబితాలో చేర్చకూడదు. ఆరు నెలలకు పైగా సర్వీసు ఉన్న అధికారుల్లో 1990 బ్యాచ్‌కు చెందిన రవిగుప్తా, 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే (సుదీర్ఘకాలంగా కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌పై ఉన్నారు), బీ శివధర్ రెడ్డి, సౌమ్యా మిశ్రా, షికాగోయల్ ఉన్నారు. వీరి పేర్లతో తాజాగా జాబితా తయారుచేసి పంపితే యూపీఎ్‌ససీ పరిశీలించి ముగ్గురి పేర్లను ఎంపిక చేస్తుంది. ఆ పేర్లను రాష్ట్రానికి పంపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ముగ్గురిలో ఒకర్ని డీజీపీగా నియమించవచ్చు.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News