Uppuguda Railway Station: డిసెంబరు కల్లా ఉప్పుగూడ రెడీ..
ABN , Publish Date - Jul 24 , 2025 | 09:21 AM
హైటెక్ హంగులతో ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకంలో భాగంగా రూ.26.81 కోట్లతో ఈ స్టేషన్‌లో చేపట్టిన పునరభివృద్ధి పనులు డిసెంబరు ఆఖరుకల్లా పూర్తి కానున్నాయని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

- అమృత్‌భారత్ పథకం కింద.. రూ.26.81కోట్లతో స్టేషన్ పునరాభివృద్ధి పనులు
హైదరాబాద్ సిటీ: హైటెక్ హంగులతో ఉప్పుగూడ రైల్వేస్టేషన్(Uppuguda Railway Station)ను ఆధునీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకంలో భాగంగా రూ.26.81 కోట్లతో ఈ స్టేషన్‌లో చేపట్టిన పునరభివృద్ధి పనులు డిసెంబరు ఆఖరుకల్లా పూర్తి కానున్నాయని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. జంట నగరాల్లోని రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు, మరింత సౌలభ్యాన్ని అందించడానికి వీలుగా స్టేషన్లో నిర్మాణపనులు చేపట్టారు. నగరానికి దక్షిణ భాగంలో ఉన్న ఉప్పుగూడ రైల్వేస్టేషన్.. ఫలక్‌నుమా - కాచిగూడ సెక్షన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
ఈ స్టేషన్ నుంచి రోజుకు సగటున 5,000 మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు బయల్దేరి వెళ్తుంటారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి పశ్చిమభాగంలోని ప్రాంతాల వైపు ఉపాధి, వ్యాపారం కోసం వెళ్తుంటారు. పలు దూరప్రాంత రైళ్లు 50 వరకు, సబర్బన్ రైళ్లు రోజూ ఈ స్టేషన్‌కు వచ్చిపోతుంటాయి. పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన వెయిటింగ్ హాల్ ఆధునికీకరణ, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి గిర్డర్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పార్కింగ్ షెడ్లకు కాంపౌండ్ వాల్ నిర్మాణం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌ల షీటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి.
- డెవల్‌పమెంట్‌లో ప్రత్యేకతలు ఇవీ..
- నూతన ముఖద్వారం ఏర్పాటు
- సెకండ్ ఎంట్రన్స్ వద్ద స్టేషన్ భవనం అభివృద్ధి
- స్టేషన్ ప్రాంగణంలో ల్యాండ్ స్కేపింగ్
- 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
- 2 ప్యాసింజర్ లిఫ్ట్‌లు, 2 ఎస్కలేటర్ల ఏర్పాటు
- ప్లాట్‌ఫామ్ ఉపరితలాన్ని మెరుగుపరచడం
- వెయిటింగ్ హాళ్ల లోపల ఆధునికీకరణ
- దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్
- నూతన సూచిక బోర్డులు
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News