Share News

Komatireddy: వచ్చే ఏడాది దసరా నాటికి ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ పూర్తి

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:56 AM

వచ్చే ఏడాది దసరా నాటికి ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Komatireddy: వచ్చే ఏడాది దసరా నాటికి ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ పూర్తి

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, ఉప్పల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది దసరా నాటికి ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే తరువాత అతిపెద్ద ఫ్లైఓవర్‌గా ఉప్పల్‌-నారపల్లి ఫ్లై ఓవర్‌ ఉంటుందని చెప్పారు. బుధవారం ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కి.మీ. మేర నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 2017లో ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనుల మొదలైతే అనేక అవరోధాలతో పనుల్లో జరిగిన జాప్యంతో వరంగల్‌, యాదగిరిగుట్ట, భువనగిరి వైపు వెళ్ళే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరితో ఉన్న పరిచయాలతో ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాంట్రాక్టర్‌ను మార్చి పనులు కొత్త వారికి ఇప్పించామన్నారు.


టీడీఎఫ్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు కోమటిరెడ్డికి ఆహ్వానం

అమెరికాలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో జరిగే తెలంగాణ డెవల్‌పమెంట్‌ ఫోరమ్‌ (టీడీఎఫ్‌) సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు రావాలని కోరుతూ ఫోరమ్‌ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం అందించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న టీడీఎ్‌ఫను మంత్రి అభినందించారు. మంత్రిని కలిసిన వారిలో టీడీఎఫ్‌ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్‌రెడ్డి, ఫోరమ్‌ ఇండియా ఛైర్మన్‌ ఎంవీ గోనరెడ్డి, జనరల్‌ సెక్రటరీ వినీల్‌ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 03:56 AM