Road Accident: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు డీఎస్పీలు మృతి
ABN , Publish Date - Jul 26 , 2025 | 07:13 AM
లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. హైదరాబాద్ పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తదితరులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నర్సింగ్‌రావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చనిపోయిన డీఎస్పీలు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నారా లోకేష్ దిగ్భ్రాంతి
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడంపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
మంత్రి సంతాపం..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్పీల మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News