Share News

Car Crash: అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొన్న కారు

ABN , Publish Date - May 05 , 2025 | 04:52 AM

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా ఓ కారు అదుపుతప్పి కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆదివారం మేడ్చల్‌ జిల్లా కీసర వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Car Crash: అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొన్న కారు

  • ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు

కీసర రూరల్‌, మే 4(ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా ఓ కారు అదుపుతప్పి కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆదివారం మేడ్చల్‌ జిల్లా కీసర వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బోడుప్పల్‌ మేడిపల్లికి చెందిన ఆరుగురు పనిమీద శనివారం బీదర్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కీసర మండలం రాంపల్లిదాయర వద్ద కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న యశ్వంత్‌ (25), పక్క సీట్లో కూర్చున్న చార్లెస్‌(25) మృతి చెందారు.


వెనక సీట్లో కూర్చున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కారును నడుపుతున్న యశ్వంత్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిసిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 04:52 AM