TGSRTC: పల్లెవెలుగు,ఎక్స్‌ప్రెస్‌లకు ఔట్‌సోర్సింగ్ కండక్టర్లు: ఆర్టీసీ
ABN , Publish Date - May 25 , 2025 | 04:33 AM
పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్లను నియమించేందుకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్లను నియమించేందుకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన సంఖ్యలో కండక్టర్లను నియమించుకోవాలని రీజనల్ మేనేజర్లను ఆదేశిస్తూ బస్‌భవన్ నుంచి ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. మ్యాన్‌పవర్ ఏజెన్సీల ద్వారా చేపట్టే కండక్టర్ పోస్టులకు నెలవారీ జీతం రూ.18 వేలుగా నిర్ణయించారు.
కండక్టర్‌గా విధుల్లో చేరే వారికి బీమాతో సహా అన్ని సదుపాయాలను ఏజెన్సీలే సమకూర్చాల్సి ఉంటుంది. కాగా, ఆర్టీసీలో 3,120 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎస్సీ వర్గీకరణ, ఇతర అంశాల పేరుతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయకుండా ఔట్ సోర్సింగ్‌లో నియామకాలు చేపట్టడాన్ని ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు.