Share News

TGSRTC: ఆలయాల సందర్శనకు ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ

ABN , Publish Date - Jun 26 , 2025 | 10:28 AM

ఒక రోజులోనే ఆలయాలు సందర్శించి తిరిగి నగరానికి చేరుకునేలా ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీలను ప్రకటించింది. కూకట్‌పల్లి రీజనల్‌ పరిధిలో కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్‌, మియాపూర్‌-2, హెచ్‌సీయూ డిపోల నుంచి టూర్‌ ప్యాకేజీలను ఈ నెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ అపర్ణ కల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు.

TGSRTC: ఆలయాల సందర్శనకు ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ

హైదరాబాద్: ఒక రోజులోనే ఆలయాలు సందర్శించి తిరిగి నగరానికి చేరుకునేలా ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీలను ప్రకటించింది. కూకట్‌పల్లి రీజనల్‌(Kukatpally Regional) పరిధిలో కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్‌, మియాపూర్‌-2, హెచ్‌సీయూ డిపోల నుంచి టూర్‌ ప్యాకేజీలను ఈ నెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ అపర్ణ కల్యాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తక్కువ ధరతో సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం బయలుదేరి అదేరోజు రాత్రికి ఇంటికి చేరుకునేలా రూట్‌మ్యాప్‌ ఖరారు చేశామన్నారు.


కూకట్‌పల్లి డిపో..

కొత్తూరు పద్మనాభ ఆలయం, ముచ్చింతల్‌ సమతామూర్తి ఆలయం, అమ్ముపల్లి సీతారామస్వామి ఆలయం, శంషాబాద్‌ వెండికొండ సిద్దేశ్వరస్వామి ఆలయం. పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300. బుకింగ్స్‌ కోసం 6301400074, 9177155057లో సంప్రదించవచ్చు.


city7.jpg

జీడిమెట్ల డిపో..

దుండిగల్‌ నుంచి గండిమైసమ్మ, షాపూర్‌నగర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, బాలానగర్‌, జేబీఎస్‌ మీదుగా జోగులాంబ అమ్మవారి దేవాలయం, మంత్రాలయం దర్శనం ఉంటుంది. పెద్దలకు రూ.1200, పిల్లలకు రూ.600. బుకింగ్స్‌ కోసం 9959226150, 9959615886లో సంప్రదించవచ్చు.


మేడ్చల్‌ డిపో..

మేడ్చల్‌ నుంచి కాళేశ్వరం టెంపుల్‌, రామప్ప టెంపుల్‌, వరంగల్‌ భద్రకాళి అమ్మవారు, వేయి స్తంభాల గుడి. పెద్దలకు రూ.1200, పిల్లలకు రూ.700. బుకింగ్స్‌ కోసం 9849737131లో సంప్రదించవచ్చు.

city7.3.jpg

మియాపూర్‌ డిపో-2..

గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, కొండగట్టు హనుమాన్‌ ఆలయం, వేములవాడ శ్రీరాజరాజేశ్వరి దేవాలయం. పెద్దలకు రూ.1200, పిల్లలకు రూ.600. బుకింగ్స్‌ కోసం 9059162162, 9959226420లో సంప్రదించవచ్చు.


హెచ్‌సీయూ డిపో..

కాళీమాత దేవాలయం, చిలుకూరు బాలాజీనగర్‌ దేవాలయం, అనంతగిరి శ్రీపద్మనాభ స్వామి ఆలయం, ఇంకతల శనీశ్వర ఆలయం. పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.200. బుకింగ్స్‌ కోసం 9948082462, 7382906847లో సంప్రదించవచ్చు.

- ఏ డిపో నుంచి అయినా 30 మంది ఉంటే మీరు నివాసం ఉండే కాలనీ నుంచే ఆలయాల సందర్శనకు యాత్రికులు నచ్చిన రూట్‌ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ ఆర్‌ఎం అపర్ణ కల్యాణి తెలిపారు. సూచనలు, సలహాల కోసం 9959226148లో సంప్రదించవచ్చన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 26 , 2025 | 01:32 PM