Hyderabad: గోల్కొండ పరిసరాల్లో ఆంక్షలు..
ABN , Publish Date - Jun 26 , 2025 | 07:40 AM
జగదాంబ మహాకాళి గోల్కొండ బోనాల సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో టాఫ్రిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

హైదరాబాద్ సిటీ: జగదాంబ మహాకాళి గోల్కొండ బోనాల(Golconda Bonalu) సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో టాఫ్రిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్(Joint CP Traffic Joel Davis) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోల్కొండలోకి ప్రవేశించే రామ్‌దేవ్‌గూడ మక్కయి దర్వాజా, లంగర్‌హౌజ్ ఫతేదర్వాజా, సెవెన్ టోంబ్స్ బంజారా దర్వాజా వైపు నుంచి ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదన్నారు.
బోనాల పూజల సందర్భంగా ఈనెల 26, 29, జూలై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీల్లో ఈ రూట్‌లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. రామ్‌దేవ్ గూడ(Ramdev Guda) నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలను ఆషూర్‌ఖానా నుంచి ఆర్మీ సెంట్రీపోస్టు సెంటర్ వరకు పార్కింగ్ సదుపాయం కల్పించారు.
కార్లు, ఆటోలకు ఆర్టిలరీ సెంటర్‌లో స్థలం కేటాయంచారు. లంగర్‌హౌజ్ వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలను జీహెచ్‌ఎంసీ పార్క్, ఫతేదర్వాజ, అల్‌హీరా స్కూల్ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. షేక్‌పేట్ వైపు నుంచి వచ్చేవారికి హాకీగ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్, గోల్ఫ్‌క్లబ్ రోడ్, డక్కన్ పార్క్, సెవెన్ టోంబ్స్, ప్రాంతాల్లో వాహనాలు నిలుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు
Read Latest Telangana News and National News